Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమీబియా ఆటగాళ్లు అద్భుతం చేయాలంటూ టీమిండియా ప్రార్థన!

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (17:41 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, భారత క్రికెట్ జట్టు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. సెమీస్ ఆశలు వదులుకునే స్థితిలో వుంది. అయితే, ఒక్క అద్భుతం జరిగితే మాత్రం కోహ్లీ సేన సెమీస్ రేసులో ఉంటుంద. లేకుంటే మూట ముల్లె సర్దుకుని ఫ్లైట్ ఎక్కాల్సివుంటుంది.
 
ఈ టోర్నీలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కదాంట్లో గెలిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల చేతిలో చిత్తుగా ఓడింది. ఆప్ఘన్ జట్టుపై మాత్రం భారీ పరుగుల తేడాతో గెలిచింది. కానీ, సమీస్‌కు మాత్రం ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ముఖ్యంగా, శుక్రవారం గ్రూప్-2లో న్యూజిలాండ్, నమీబియా పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుతుంది. ఓడిపోతే మాత్రం టీమిండియాకు లాభిస్తుంది. తన చివరి రెండు మ్యాచ్‌లను టీమిండియా భారీ తేడాతో నెగ్గితే న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. 
 
ఇది జరగాలంటే నేటి నమీబియా అద్భుతం చేయాలి! ఇవాళ్టి మ్యాచ్‌కు షార్జా ఆతిథ్యమిస్తోంది. న్యూజిలాండ్‌పై టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోవాలని భారత్ క్రికెటర్లతో పాటు.. అభిమానులు కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. 
 
ఈ మ్యాచ్‌లో కాకపోయినా, తన తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలోనైనా న్యూజిలాండ్ ఓడిపోవాలన్నది భారత అభిమానుల ఆశ! ఆప్ఘనిస్థాన్ జట్టుకు సంచలనాలు కొత్తేమీ కాదు. ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

తర్వాతి కథనం
Show comments