Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలంగా బంతిని కొడితే... గింగిరాలు తిరుగుతూ వికెట్లను ముద్దాడింది.. ఔటా? కాదా? (ఫన్నీ వీడియో)

క్రికెట్‌ మైదానంలో అపుడపుడూ కొన్ని ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఇవి చూసేవాళ్లకే కాదు.. క్రీజ్‌లో ఉండి బ్యాట్ ఝుళిపించేవారిని సైతం ఒకింత షాక్‌కు గురిచేస్తుంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఈ ఫన్

Webdunia
గురువారం, 24 మే 2018 (15:23 IST)
క్రికెట్‌ మైదానంలో అపుడపుడూ కొన్ని ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఇవి చూసేవాళ్లకే కాదు.. క్రీజ్‌లో ఉండి బ్యాట్ ఝుళిపించేవారిని సైతం ఒకింత షాక్‌కు గురిచేస్తుంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఈ ఫన్నీ సంఘటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కూడా స్పందించింది. ఇంతకీ ఆ ఫన్నీ సంఘటన ఏంటో పరిశీలిద్ధాం.
 
దుబాయ్‌లో కొందరు ముస్లిం కుర్రోళ్ళంతా కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌ను మరికొందరు తిలకిస్తున్నారు. ఇంకొందరు వీడియో(మొబైల్‌లో) కూడా తీస్తున్నారు. బౌలర్ బంతిని విసిరాడు. బ్యాట్స్‌మన్ ఆ బంతిని బలంగా కొట్టాడు. అయితే అతడు కొట్టిన ఆ బంతి గింగిరాలు తిరుగుతూ, వికెట్ల వైపు(దురదృష్టవశాత్తు) దూసుకొచ్చింది. ఆ బంతి రాకను గమనించిన బ్యాట్స్‌మన్ దాన్ని ఆపాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఆ బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. ఇప్పడు ఆ బ్యాట్స్‌మన్ అవుటైనట్లా..? కాదా..? దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ బ్యాట్స్‌మెన్ ఔటైనట్టుగానే పరిగణిస్తారు. పైగా, ఫీల్డ్ అంపైర్ కూడా ఔట్‌గానే ప్రకటించారు. 
 
నిజమే.. బంతి బ్యాట్‌నుగానీ, బ్యాట్స్‌మన్‌నుగానీ తాకి వికెట్లను తాకితే అతడు అవుటైనట్లే. మరి ఈ బ్యాట్స్‌మెన్ మాత్రం తాను ఔట్ కాదంటూ వాదనకు దిగుతాడు. ఆ తర్వాత చేసేదేమిలేక బ్యాట్‌ను మరో ఆటగాడికి ఇచ్చి ఫీల్డింగ్‌కు వెళతాడు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన గమ్మత్తయిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో, క్రికెట్ ఫ్యాన్స్ దీనిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో ఇది కాస్తా వైరల్ అయింది.
 
అసలు ఆ వీడియో విషయానికొస్తే, ఈ వీడియో చూసిన ఓ క్రికెట్ అభిమానికి 'బంతిని కొడితే అది వ్యతిరేక దిశ(అనుకోకుండా)లో గింగిరాలు తిరుగుతూ వికెట్లను తాకింది కదా.. ఇది ఏ నిబంధన కింద అవుట్..?' అనే సందేహం వచ్చింది. దీంతో అతడు ఈ వీడియోను అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ)కి పంపాడు.
 
దీనికి స్పందించిన ఐసీసీ ట్విట్టర్ వేదికగా ఆ ఫ్యాన్‌కు సమాధానం చెప్పింది. 'హజ్మా అనే క్రికెట్ ఫ్యాన్.. ఈ వీడియో పంపి ఇది ఏ నిబంధన కింద అవుట్ అని ప్రశ్నించాడు. ఐసీసీ నియమావళి 32.1 ప్రకారం దురదృష్టవశాత్తూ ఇది అవుటే' అని ఐసీసీ ట్వీట్ చేసింది. ఆ వీడియోను మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

తర్వాతి కథనం
Show comments