Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఐసీసీ అవార్డ్స్ ఆఫ్ ది డికేడ్‌'గా విరాట్ కోహ్లీ

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (21:45 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవార్డ్స్ ఆఫ్ ది డికేడ్ పురస్కారం ఆయనకు వరించింది. ఐసీసీ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంపికయినట్లు ఐసీసీ వర్గాల సమాచారం. దీనిపై ఈ నెల 28వ తేదీన ఐసీసీ అత్యున్నత నిర్ణాయక మండలి అధికారికంగా ప్రకటించనుంది. 
 
గత నెలలో ఐసీసీ డికేడ్ అవార్డుల నామినేషన్లను ప్రకటించారు. పలు కేటగిరీలకు సంబంధించి ఐసీసీ మెన్స్, ఉమెన్స్ క్రికెటర్ల అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ మంది అభిమానులు 5 మిలియన్ల ఓట్లను వేశారు. అభిమానుల ఓట్లతో పాటు జ్యూరీ ఓట్లను కూడా జతచేసి విజేతలను ప్రకటించనున్నారు. 
 
కాగా, విరాట్ కోహ్లీ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఫర్ మేల్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నట్లు సమాచారం. అయితే భారత క్రికెటర్లలో కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, జులన్ గోస్వామి, మిథాలి రాజ్‌కూడా పలు కేటగిరీల్లో నామినేట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

తర్వాతి కథనం
Show comments