Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెరీర్ మొత్తం వర్ణ వివక్షకు గురయ్యా : మాజీ స్పిన్నర్ శివరామకృష్ణన్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (09:01 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ మొత్తం వర్ణ వివక్షకు గురైనట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శరీర రంగు గురించి పలు సందర్భాల్లో, పలు వేదికలపై విమర్శలు ఎదుర్కొన్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. 
 
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో జాతి వివక్ష వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇలాంటి తరుణంలో శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇపుడు శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన కెరీర్ మొత్తం వివక్షకు గురైనట్టు ప్రకటించారు. 
 
కాగా, గతంలో తమిళనాడుకు చెందిన అభినందన్ ముకుంద్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 15 యేళ్ల వయసు నుంచే విదేశాలకు వెళ్తున్నానని, తన రంగు గురించి కొందరు మాట్లాడుకోవడం, వ్యాఖ్యలు చేయడం ఏంటో తనకు అర్థమయ్యేది కాదని అన్నాడు. 
 
నిజానికి క్రికెట్‌ గురించి తెలిసిన వారికి క్రికెటర్ల రంగుపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. ఎందుకంటే, మండుటెండల్లో సాధన చేస్తాం, క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుంటామని దీంతో శరీర రంగుల్లో మార్పులు చోటు చేసుకుంటాయని ముకుంద్ చెప్పుకొచ్చారు. ఇపుడు తమిళనాడుకే చెందిన శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ప్రకపంనలు సృష్టించనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

తర్వాతి కథనం
Show comments