ధోనీ స్థానమే భర్తీ చేయలేను.. ఇక ధోనీకి వారసుడిని ఎలా అవుతాను?

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (16:25 IST)
భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసే క్రికెటర్ కనుచూపుమేరలో లేరనీ భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్‌గా ఎన్నికైన రిషబ్ పంత్ అభిప్రాయపడ్డారు. పైగా, తనను ధోనీ వారసుడు అనడాన్ని కొట్టిపారేశారు.
 
వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. దీనిపై పంత్ స్పందిస్తూ, ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం సామాన్యమైన విషయం కాదని, దీన్నో సవాలుగా తీసుకుంటానని తెలిపాడు.
 
ధోనీ వారసుడు అంటూ మీడియాలో వస్తున్న కథనాల పట్ల తాను ఆలోచించడం మొదలుపెడితే సమస్యలు తప్పవని అన్నాడు. అందుకే తాను జట్టుకు ఏంచేయగలనో దానిపైనే శ్రద్ధ చూపిస్తానని, దేశం కోసం మెరుగైన ప్రదర్శన కనబర్చాలని కోరుకుంటానని తెలిపాడు. 
 
ఇదే తన మొదటి ప్రాధానత్య అని అన్నాడు. నేర్చుకోవాల్సిన, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడుతున్నానని పంత్ చెప్పాడు. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే టీమిండియాలో 21 సంవత్సరాల రిషభ్ పంత్ కు ప్రధాన వికెట్ కీపర్ స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ టూర్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments