Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక చాలు.. విమర్శలతో జట్టుకు దూరం.. కాశ్మీర్‌లో ధోనీ ఉద్యోగం..

ఇక చాలు.. విమర్శలతో జట్టుకు దూరం.. కాశ్మీర్‌లో ధోనీ ఉద్యోగం..
, గురువారం, 25 జులై 2019 (16:47 IST)
ప్రపంచ కప్‌లో రాణించలేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్‌తో కలిశాడు. భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. 
 
ధోనీ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. క‌ాశ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు. కాశ్మీర్‌‍లో వున్న విక్టర్ ఫోర్స్‌తో ధోనీ కలవనున్నాడు. అక్కడ పారాచూట్ రిజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలను ధోనీ నిర్వర్తించనున్నాడు. భద్రతా దళాలతో 15 రోజుల పాటు ధోనీ గడపనున్నాడు.
 
కాగా పారామిలటరీ రిజిమెంట్‌లో సేవలు అందించేందుకు రెండు నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో వుండనని బీసీసీఐకి ధోనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు. అతను స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నాయ కీపర్‌గా ఎంపిక చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బా.. విశ్వవిజేత ఖాతాలో చెత్త రికార్డు.. 85 పరుగులకే ఆలౌట్.. వాన్ ఫైర్