Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ టైటాన్స్‌ దూకుడుకు పంజాబ్ బ్రేక్

Webdunia
బుధవారం, 4 మే 2022 (08:51 IST)
ఐపీఎల్ 15 సీజన్ పోటీల్లో వరుస విజయాలతో దూసుకునిపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్రేక్ పడింది. గుజరాత్ దూకుడుకు పంజాబ్ బ్రేక్ వేసింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే సాధించింది. దీంతో గుజరాత్ జట్టు ఓటమిని చవిచూసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు ఏమాత్రం కలిసిరాలేదు. పంజాబ్ బౌలర్ కగిసో రబడ గుజరాత్ అటగాళ్ళు పరుగులు చేయలేక పోయారు. రబడ నిప్పులు చెరుగుతూ బంతులు విసిరాడు. దీంతో ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూకట్టారు. కానీ, సాయి సుదర్శన్ మాత్రం ఆ జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచి 50 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 65 పరుగుులు చేయడమే కాకుండా అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ (1) వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ శిఖర్ ధావన్ - భానుక రాజపక్స జోడీ 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో రాజపక్స 40 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్ స్టోన్ అండగా నిలబడటంతో శిఖర్ ధావన్ మిగిలిన పనిని పూర్తి చేశాడు. శిఖర్ ధావన్ మొత్తం 53 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 62 పరుగులు చేయగా, స్టోన్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఫలితంగా 16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. నాలుగు వికెట్లు తీసిన రబడకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments