Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె వన్డే: కోహ్లీ సెంచరీ... వెస్టిండీస్ విజయం

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (12:42 IST)
ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పూణెలో జరిగిన వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ అది వృధాగా మారింది. 
 
తొలి వన్డేలో ఓటమిని ఎదుర్కొని.. రెండో వన్డేలో మ్యాచ్‌ను టైగా ముగించిన విండీస్.. మూడో వన్డేలో ఏకంగా ఆతిథ్య భారత్‌ను మట్టికరిపించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన కరీబియన్ టీమ్ ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు ఆటగాళ్లు ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ మినహా మిగతా బౌలర్లు ధారళంగా పరుగులిచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 283 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షెయ్ హోప్(95) కీలక సమయంలో గొప్పగా రాణించాడు. ఆఖర్లో నర్స్(40) ఆ జట్టుకు మెరుపు ముగింపునిచ్చాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. 
 
దీంతో విండీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (107: 119 బంతుల్లో 10ఫోర్లు, సిక్స్) అద్భుత శతకం వృథా అయింది. శిఖర్ ధావన్(35) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో మార్లోన్ శామ్యూల్స్ మూడు, జాసన్ హోల్డర్, మెకాయ్, నర్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

తర్వాతి కథనం
Show comments