Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపండయ్యా.. వివాదాలొద్దు.. ఆటంటే అలానే వుంటుందన్న ధోనీ..(video)

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:01 IST)
టీమిండియా కివీస్ పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మొత్తం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు మారుమోగిపోతుంది. ధోనీ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌తో పాటు టీమిండియాకు ధోనీ ఇచ్చే సలహాలు సూచనలు ప్రస్తుతం చర్చకు తావిస్తున్నాయి. వివాదాలను మైదానంలోనే పరిష్కరించడంతో పాటు బౌలర్లకు క్లిష్ట పరిస్థితుల్లో సూచనలు ఇచ్చి ఆదుకునే ధోనీని ప్రస్తుతం న్యూజిలాండ్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే.. కివీస్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ విలియమ్స్ కొట్టిన బంతి.. ఎత్తుకు ఎగిరి.. ఆ బంతిని విసిరిన పాండ్యా  వద్దకే క్యాచ్‌కు వచ్చింది. ఆ సమయంలో రన్నర్‌గా వుండిన సైఫర్ అనే బ్యాట్స్‌మెన్.. తప్పుకోకుండా.. కావాలనే బౌలర్‌కు అడ్డు తగిలాడు. అంతేగాకుండా ఆ క్యాచ్‌ను కృనల్ పాండ్యాను పట్టలేనట్లు చేశాడు. 
 
ఈ వికెట్ మాత్రం భారత్‌కు లభించి వుంచే.. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చి వుండేది. ఈ సంగతిని కాస్త పక్కనబెడితే.. క్యాచ్‌ను కివీస్ రన్నర్ అడ్డుకోవడంతో.. కృనల్ పాండ్యా ఆవేశంతో అంపైర్ వద్ద అవుట్ ఇవ్వాల్సిందిగా అప్పీల్ చేశాడు. దాన్ని చూసిన రోహిత్ శర్మ కూడా అంపైర్ వద్దకు వచ్చి వాగ్వివాదానికి దిగాడు. 
 
కానీ రోహిత్ శర్మ మళ్లీ ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్ళాడు. అయితే పాండ్యా మాత్రం బౌలింగ్ చేయకుండా రోహిత్ శర్మ, అంపైర్ వద్ద సైగలతో ఏదో మాట్లాడుతూ నిలబడ్డాడు. ఆ సమయంలో ధోనీ తన చేతులెత్తి.. వదిలేయండి.. వివాదాన్ని ఆపండి బాబూ.. ఆటలో ఇదంతా మామూలే.. అన్నాడు. దీంతో కృనల్ పాండ్యా ధోనీ మాటలు విని బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. 
 
ఇలా ధోనీ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌‌లో రికార్డు కావడంతో ధోనీ.. క్రీడా స్ఫూర్తిని కివీస్ మీడియా కొనియాడింది. భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్ అంటూ కివీస్ మీడియా ప్రశంసించింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా.. ప్రశాంతంగా వుండి.. సహచరులను కూడా అదే తరహాలో వివాదాల వెంట నడవనీయకుండా చేయడంతో ధోనీ దిట్ట. అందుకే అతనికి కెప్టెన్ కూల్ అనే పేరొచ్చిందని కివీస్ మీడియా కితాబిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments