Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (09:08 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కొనసాగుతున్నారు. ఆమెను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కలుసుకుని ఒక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు. 
 
మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 23వ తేదీన, మూడో మ్యాచ్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గవర్నర్‌ను అజారుద్దీన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు అజారుద్దీన్ స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలిసి మ్యాచ్‌కు రావాలంటూ ఆహ్వానించారు. 
 
ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, 3 టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ మూడో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులతో కలిసి తనను కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అహ్వానించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments