టీమిండియాలో బెర్తు కోసం ఎదురు చూడటం లేదు : హార్దిక్ పాండ్యా

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (15:17 IST)
భారత క్రికెట్ జట్టులో చోటు కోసం తాను ఎదురు చూడటం లేదని హార్దిక్ పాండ్యా అన్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ ఇటు బ్యాటు, అటు బంతితో రాణిస్తున్నారు. దీంతో హార్దిక్ పాండ్యాకు తిరిగి జట్టులో చోటు దక్కుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటిపై హార్దిక్ పాండ్యా స్పందించారు. 
 
ఇపుడు భారత జట్టులో చోటు గురించి ఆలోచన చేయడం కంటే ఆటపైనై దృష్టి పెట్టానని చెప్పారు. "నేను జట్టులోకి తిరిగి వస్తున్నానని అనుకోవడం లేదు. అస్సలు దాని గురించి నేను ఆలోచన చేయడం లేదు. ప్రస్తుతం నేను ఆడే గేమ్‌పైనే దృష్టి పెడుతున్నా" అని అన్నారు. 
 
ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నానని అందువల్ల తన దృష్టంతా ఇపుడు దానిపైనే ఉందని చెప్పారు. ఆ తర్వాత తన భవిష్యత్ ఎక్కడికెళుతుందో వేచి చూడాల్సిందేనని చెప్పారు. అది తన చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి తాను ఆడుతున్న జట్టు కోసం మాత్రమే తన దృష్టిని కేంద్రీకరిస్తానని పేర్కొన్నారు. 
 
ఆటతీరుపరంగా చాలా సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. తన ఆట మెరుగవ్వడంలో కెప్టెన్సీ ఎంతో ఉపకరించిదని వివరించాడు. బాధ్యతలను తీసుకునేందుకు ఇష్టపడే క్రికెటర్‌ అని తెలిపాడు. ఆటను బాగా అర్థం చేసుకున్నపుడే విజయం సాధించగలమని హార్దిక్ పాండ్యా సెలవిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

ఐబొమ్మ రవి గుట్టును భార్య విప్పలేదు.. పోలీసుల పంపిన మెయిల్స్‌కు స్పందించి వలలో చిక్కాడు...

సంక్రాంతికి పెరగనున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు.. విమానం ఛార్జీలే మేలట..

రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

Male Nurse: మహిళా వైద్యులు, పీజీ మెడికోలు బట్టలు మార్చే వీడియోలు తీసిన మేల్ నర్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments