Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022: రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం...

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (11:31 IST)
ఐపీఎల్ 2022లో శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
 
చివరి ఓవర్లో 'నో బాల్' లొల్లితో మ్యాచ్ కాసేపు ఆగగా.. రాజస్థాన్ విజయాన్ని మాత్రం ఢిల్లీ అడ్డుకోలేకపోయింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేసి.. 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
రిషబ్ పంత్ (44), రోవ్‌మెన్ పావెల్ (36), లలిత్ యాదవ్ (37) ధాటిగా ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.
 
ఆఖరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో 19వ ఓవర్‌ను ప్రసిధ్ కృష్ణ మెయిడిన్‌ వేసి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్‌లో మొదటి మూడు బంతులకు 3 సిక్స్‌లు కొట్టిన రోవ్‌మన్‌ పావెల్ (36) ఢిల్లీని గెలిపించినంత పని చేశాడు. 
 
అయితే మూడో బంతిని మెక్‌కాయ్ ఫుల్‌టాస్ వేశాడు. అది నోబాల్ అని ఢిల్లీ వాదించింది. కెప్టెన్ పంత్, కోచింగ్ సిబ్బంది గందరగోళానికి తెరతీశారు. ఆటగాళ్లను ఆడకుండా వచ్చేయాలని పంత్ సైగలు చేశాడు. అయితే అంపైర్లు అది నోబాల్ కాదని స్పష్టం చేశారు. 
 
మెక్‌కాయ్‌ మిగతా మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చి పావెల్‌ను ఔట్ చేయడంతో రాజస్థాన్‌ విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ఆలస్యంగా వచ్చిదనీ రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

తర్వాతి కథనం
Show comments