Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల్ ట్యాంపరింగ్: ఆ ఇద్దరిపై జీవితకాల నిషేధం? ఐసీసీపై భజ్జీ ఫైర్.. ఎందుకు?

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెరీర్‌ ముగిసినట్టేనని ఆసీస్ మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ ఈ ఇద్దరిపై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర

Harbhajan
Webdunia
సోమవారం, 26 మార్చి 2018 (18:07 IST)
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెరీర్‌ ముగిసినట్టేనని ఆసీస్ మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ ఈ ఇద్దరిపై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేటు వేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, ఆటలో ఏ విధమైన మోసం చేసినా జీవితకాల నిషేధాన్ని అనుభవించాల్సిందే. తాము బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మీడియా ముందు అంగీకరించడంతో వారిద్దరిపై జీవితకాల నిషేధం తప్పదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
బాల్ ట్యాంపరింగ్ తప్పని తెలిసి కూడా అనుమతించిన కోచ్ డారెన్ లీమన్ పైనా చర్యలు తప్పవని సమాచారం. ఆస్ట్రేలియా క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేసేది అసాధ్యమేనని తెలుస్తోంది. 
 
మరోవైపు కెప్టెన్‌ స్మిత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధంతోపాటు వంద శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది ఐసీసీ. ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఐసీసీ తీసుకున్న చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ ఓ న్యాయం... ఆసీస్ ఆటగాళ్లకు ఓ న్యాయమా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఐసీసీ తీసుకున్న చర్యలపై భారత క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ట్వీట్ చేస్తూ.. ''బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో గొప్ప శిక్షే వేశారు.. వారెవ్వా.. అంటూ ఎద్దేవా చేశాడు. అన్ని ఆధారాలున్నప్పటికీ బెన్‌క్రాఫ్ట్‌పై నిషేధంలేదన్నాడు. గతాన్ని మర్చిపోయారా? మితిమిరి అప్పీల్‌ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కో మ్యాచ్‌ నిషేధించారు.
 
2008 సిడ్నీలోనూ మంకీగేట్‌ వివాదం (జాతివివక్ష) పేరిట తనపై మూడు టెస్టుల ఆడకూడదని వేటేశారు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా శిక్షలుంటాయా? అంటూ ఐసీసీని భజ్జీ ప్రశ్నించాడు. ఇంకా వ్యక్తిని బట్టి, అతను ప్రాతినిథ్యం వహించే జట్టునుబట్టి ఐసీసీ అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా? అంటూ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments