Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్విట్టర్ యూజర్‌ను కుక్కతో పోల్చిన భజ్జీ..

టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ యూజర్‌పై శివాలెత్తాడు. ట్విట్టర్ యూజర్‌ను అతడు శునకంతో పోల్చాడు. శునకం అరిచే పనిలోనే ఉండాలని సూచించాడు. ప్రస్తుతం భజ్జీ ట్వీట్ వైరల్ అవుతోంది. భజ్జీ కోపం తె

ట్విట్టర్ యూజర్‌ను కుక్కతో పోల్చిన భజ్జీ..
, గురువారం, 23 నవంబరు 2017 (10:55 IST)
టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ యూజర్‌పై శివాలెత్తాడు. ట్విట్టర్ యూజర్‌ను అతడు శునకంతో పోల్చాడు. శునకం అరిచే పనిలోనే ఉండాలని సూచించాడు. ప్రస్తుతం భజ్జీ ట్వీట్ వైరల్ అవుతోంది. భజ్జీ కోపం తెప్పించేలా.. ఆ ట్విట్టర్ యూజర్ ఏమన్నాంటే.. రిటైర్మెంట్ సలహా ఇచ్చాడు. నీవో కుక్కవని, అరవడానికి మాత్రమే పనికొస్తావంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
 
నియోల్ స్మిత్ అనే ట్విటరాటీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి హర్భజన్ తప్పుకుంటే మంచిదన్నాడు. క్రికెట్లో భజ్జీ మంచిరోజులు అయిపోయాయి. కొత్త ట్రిక్స్‌ నేర్చుకోవడంలో విఫలమైన నీవు గౌరవప్రదంగా తప్పుకో... తెలివి తక్కువగా ప్రవర్తించి పేరును పాడుచేసుకోవద్దంటూ వాగాడు. అంతటితో ఆగకుండా నీపనైపోయిందన్న సంగతి తెలుసుకుని తప్పుకుంటే క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని సలహా ఇచ్చాడు.  
 
స్మిత్ ట్వీట్‌పై భజ్జీ అంతెత్తున ఎగిరి పడ్డాడు. జీవితంలో ఓడిపోయిన వారే ఇలాంటి సలహాలిస్తారని.. కుక్కలు అరవడానికే పనికొస్తాయి. నువ్వు ఆపనిలో వుండంటూ ఫైర్ అయ్యాడు. నేర్చుకునేందుకు ప్రతి రోజు ఏదో ఒక విషయం ఉంటుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం మానుకోమని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. హర్భజన్ ట్వీట్ వైరల్ అయింది. కొందరు విమర్శిస్తే.. మరికొందరు భజ్జీని అభినందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భజ్జీకి సారీ చెప్పిన దాదా.. త్వరలోనే కలుస్తానన్న హర్భజన్