Webdunia - Bharat's app for daily news and videos

Install App

భజ్జీ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారోచ్.. ఏంటందో తెలుసా?

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (10:17 IST)
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సతీమణి, బాలీవుడ్ బ్యూటీ గీతా బాస్రా ఇటీవలే సోషల్ మీడియాకు దూరమైంది. ఇందుకు ఆమె ప్రెగ్నెంట్‌గా వుండటమే కారణమని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేసేలా బాస్రా దంపతులు గుడ్ న్యూస్ చెప్పింది. 
 
హర్భజన్ సింగ్, గీతా బాస్రా 29 అక్టోబర్, 2015న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో ఈ దంపతులకు అమ్మాయి జన్మించగా, ఇప్పుడు జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. హర్భజన్, గీతాల కూతురు హినయా హీర్ ప్లహా తాను అక్కను కాబోతున్నట్టు ప్లక్కార్డ్ పట్టుకొని ఫొటోకి ఫోజులిచ్చింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హర్భజన్ సింగ్ త్వరలో ఐపీఎల్‌లో సందడి చేయనున్నాడు. కేకేఆర్ టీం తరపున ఆయన బరిలోకి దిగనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కోలీవుడ్‌లో 'ఫ్రెండ్‌షిప్' అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. 
 
ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇక హర్బజన్ భార్య గీతా భస్రా బాలీవుడ్‌లో 'దిల్ దియా హై', 'ది ట్రైన్', 'సెకండ్ హ్యాండ్ హాడ్సెండ్' వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments