Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌‍లో ఇలాంటి అద్భుతమైన క్యాచ్ మీరెప్పుడూ చూసివుండరు...

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (09:06 IST)
ఇటీవలికాలంలో క్రికెట్ క్రీడలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటగాళ్లు తమ ఆటతీరును కూడా మార్చుకుంటున్నారు. కొంతమంది క్రికెటర్లు వినూత్నమైన షాట్లు కొడుతూ బంతిని బ్యాలెన్స్ కంట్రోల్ కాకపోవడంతో బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ క్యాచ్ పడుతుంటారు. ఇపుడు ఓ ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టి ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
ఆ ఫీల్డర్ ఏం చేశాడంటే... బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకుని బ్యాలెన్స్ కంట్రోల్ కాకపోవడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. అతడు గాల్లోకి ఎగిరే కాలితో బంతిని గ్రౌండ్‌లోకి తన్నాడు. ఆ వెంటనే వేరే ఫీల్డర్ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో చూసి క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. 
 
మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మైఖేల్ వాన్, జిమ్మీ నీషమ్‌లు తమ ట్విట్టర్ ఖాతాల్లో దీన్ని పోస్ట్ చేస్తున్నారు. మీరు ఫుట్‌బాల్ ఆడటం కూడా తెలిసిన క్రికెటర్‌ని ఆడిస్తే ఇలా జరుగుతుంది" అని సచిన్ ట్వీట్ చేశాడు. ఖచ్చితంగా ఇది అద్భుమైన క్యాచ్ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

తర్వాతి కథనం
Show comments