Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు షాక్... టెస్ట్ జట్టు హెడ్ కోచ్ రాం రాం

ఠాగూర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (10:39 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో తేరుకోలేని షాక్ తగిలింది. టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ జాసన్ గిలెస్పీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని క్రిక్ బజ్ వెల్లడించింది. మరికొన్ని గంటల్లో పాక్ జట్టు రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉండగా ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది.
 
'గిలెస్పీ రాజీనామా చేశారు' అని పీసీబీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని క్రిక్‌బజ్ పేర్కొంది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్‌ను టెస్టు జట్టుకు తాత్కాలికంగా పీసీబీ నియమించింది. "రెడ్ బాల్ హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ రాజీనామా తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆకిబ్ జావేద్‌ను తాత్కాలిక రెడ్ బాల్ హెడ్ కోచ్ నియమించింది" అని పీసీబీ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాగా, అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్ కాంట్రాక్టును పునరుద్దరించడానికి పీసీబీ నిరాకరించడంతోనే గిలెస్పీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గిలెస్పీ, నీల్సన్ ఇద్దరూ మంచి అవగాహనతో జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు.
 
ఇక గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా తర్వాత ఆకిబ్ జావేద్ ఇంతకుముందు వైట్ బాల్ జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్ నియమితుడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మూడు టీ20లు, మూడు వన్డేల కోసం పాక్ వైట్ బాల్ జట్టుతో ఉన్నాడు.
 
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

Jagan: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్మోహన్ రెడ్డి.. క్రిమినల్ కేసు పెట్టడం?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

తర్వాతి కథనం
Show comments