గుండెపోటుతో అంపైర్ అసద్ రవూఫ్ మృతి

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:52 IST)
Asad Rauf
పాకిస్తాన్  వివాదాస్పద అంపైర్ అసద్ రవూఫ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. లాహోర్‌లోని లాండా బజార్‌లో తన బట్టల షాప్ మూసి వేసి ఇంటికి వెళ్లే క్రమంలో ఛాతిలో నొప్పితో అసద్ రవూఫ్ తీవ్రంగా ఇబ్బంది పడగా.. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్లు సోదరుడు తాహిర్ తెలిపాడు. 
 
అంపైర్ గా ఒక వెలుగు వెలిగిన అసద్ రవూఫ్.. 2013లో జరిగిన ఐపీఎల్ కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయాడు. బుకీల నుంచి కాస్ట్ లీ బహుమతులు స్వీకరించి అవినీతికి పాల్పడినట్లు బీసీసీఐ విచారణలో తేలింది. దాంతో అసద్ అంపైరింగ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. అసద్ వయసు 66 సంవత్సరాలు. 
 
రవూఫ్ తన అంపైరింగ్ కెరీర్ ను 1998లో ఆరంభించాడు. 2000లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వన్డేల్లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు. 
 
నాలుగు సంవత్సరాల తరువాత 2004లో రవూఫ్ తొలిసారిగా అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చేర్చబడ్డాడు. తన కెరీర్ లో అసద్ 47టెస్టులు, 98వన్డేలు, 23 టీ20లకు అంపైర్‌గా పనిచేశాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments