ఆప్ఘనిస్థాన్‌తో తొలి టీ-20లో భారత్ గెలుపు- రోహిత్ అరుదైన రికార్డ్

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (12:08 IST)
ఆప్ఘనిస్థాన్‌తో మొహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. టీ20ల్లో భారత్‌పై అఫ్గాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

అనంతరం ఛేదనకు వచ్చిన భారత్ 17.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో ముజీబ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 100 విజయాల్లో భాగమైన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున రోహిత్ ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడగా 100 సార్లు గెలుపు రుచి చూశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ అధికారి

సంస్కృత వర్శిటీ విద్యార్థినిపై లైంగికదాడి.. ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు

మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు

పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

తర్వాతి కథనం
Show comments