Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టీ20 : ఆప్ఘాన్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (08:13 IST)
భారత్‌లో ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా, గురువారం రాత్రి మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై విజయభేరీ మోగించింది. భారత క్రికెటర్ శివమ్ దూబే రెచ్చిపోయాడు. 40 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 60 పగుగులు చేసాడు. దీంతో ఆప్ఘనిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల విజయలక్ష్యాన్ని 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ డౌకౌట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 23, తిలక్ వర్మ 26, జితేశ్ శర్మ 31 చొప్పున రాణించారు. మ్యాచ్ ఆఖరులో హార్డ్ హిట్టర్ రింకూసింగ్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. రింకూ సింగ్, శివమ్ దూబేలు అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు. ఆప్ఘన్ బౌలర్లలో ముజబీ ఉర్ రెహ్మాన్ 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ చొప్పున తీశాడు. 
 
ఈ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ స్పందిస్తూ, మొహాలీ మ్యాచ్ ఆడడాన్ని ఆస్వాదించానని చెప్పాడు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధికమించినట్టు చెప్పాడు. మొదటి రెండు మూడు బంతులు కొంత ఒత్తిడిగా అనిపించిందని, ఆ తర్వాత నేను బంతిపై దృష్టిపెట్టి ఆడానని రింకూ చెప్పాడు. పెద్ద సిక్సర్లు కొట్టగలననే నమ్మకం తనకు ఉందన్నాడు. ఆ అవకాశం రావడంతో బౌలింగ్ చేశానని చెప్పాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌‍లో ఈ విషయాలను పంచుకున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments