Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసవత్తరంగా చెన్నై టెస్ట్ : ఇంగ్లండ్ వెన్నువిరిచిన భారత బౌలర్లు.. 134కే ఆలౌట్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (15:57 IST)
చెన్నై టెస్ట్ మ్యాచ్ రెండో రోజే రసవత్తరంగా మారింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ జట్టు వెన్నువిరిచారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోమారు ఈ సిరీస్‌లో 5 వికెట్ల ప్రదర్శన కనబర్చిన వేళ ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. 
 
అశ్విన్ 23.5 ఓవర్లలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. కొత్త స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మకు కూడా 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
 
కాగా, భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను భారత బౌలర్లు కేవలం 6 పరుగులకే ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలిపోయింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. క్రమం తిప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు పనిబట్టారు. ఓలీ పోప్ 22 పరుగులు చేయగా, స్టోక్స్ 18 పరుగులు సాధించాడు.
 
ఇకపోతే, టీమిండియాకు 195 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తన రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పైచిలుకు పరుగులు చేస్తే ఇంగ్లండ్ ముందు కష్టసాధ్యమైన టార్గెట్ ఉంచే వీలుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments