Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియా అదుర్స్.. రోహిత్ సెంచరీతో 300 పరుగులు

Advertiesment
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియా అదుర్స్.. రోహిత్ సెంచరీతో 300 పరుగులు
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:25 IST)
చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజున టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ 161 పరుగులు, వైస్‌ కెప్టెన్‌ 67 పరుగులతో రాణించారు. రిషబ్‌ పంత్ 33 పరుగులు అక్షర్ పటేల్ 5 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. ఆ తర్వాత పుంజుకుంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహనే అద్భుత భాగస్వామ్యం భారత్‌ను పటిష్ట స్థితిలో పెట్టింది. 
 
ఓపెనర్ గిల్ డకౌట్ కాగా.. ఆ తర్వాత వరుస ఇంటర్వెల్స్‌లో పుజారా 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. 131 బంతుల్లో శతకం సాధించిన రోహిత్ శర్మ రహానేతో కలిసి స్కోర్‌ను పరుగులు పెట్టించాడు.
 
తొలి రోజే బంతి బాగా స్పిన్ అవుతుండటంతో పరుగులు తీయడానికి బ్యాట్స్‌మెన్ శ్రమించారు. స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్ అయిన తీరుతో పిచ్ స్పిన్‌కు ఎంతగా అనుకూలిస్తుందో అర్థమైంది. రోహిత్ బ్యాటింగ్‌పై సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడాలని రోహిత్ అనుకోవడం శుభ పరిణామమని, అతడి షాట్ సెలెక్షన్ బాగుందని లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మెచ్చుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అంటావా?: గుత్తా జ్వాలాపై నెటిజన్