Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు ... మౌనం అర్థాంగికారం కాదు : చాహల్ సతీమణి ధర్మశ్రీ

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (15:04 IST)
భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ దంపతులు విడిపోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. దీనిపై ధనశ్రీ వర్మ తాజాగా ఓ ట్వీట్ చేయగా, అది వైరల్‌గా మారింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
 
'కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయం నన్ను నిజంగా బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాను. నేను మౌనంగా ఉంటున్నానంటే దాని అర్ధం బలహీనంగా ఉన్నట్లు కాదు.
 
సోషల్ మీడియాలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం అవసరం. నేను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విలువలతో ముందుకుసాగాలనుకుంటున్నా. నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు' అని ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ధనశ్రీ పోస్ట్ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments