Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్ షమీ భార్య అరెస్ట్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (19:08 IST)
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీనా జహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షమీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేశారు. హసీన్ జహాన్ షమీ ఇంట్లో గొడవకు దిగిందనే కారణంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కిందట షమీ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అలాగే తనను చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీంతో కోల్‌కతా పోలీసులు షమీపై ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 
 
ఈక్రమంలో దంపతుల మధ్య గొడవ కాస్త సద్దుమణిగింది. కానీ వాళ్లిద్దరు మాత్రం కలిసి ఉండటం లేదు. కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సహాస్‌పూర్‌ అలీనగర్‌ గ్రామంలో ఉన్న షమీ ఇంటికి వెళ్లిన హసీన్‌ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. హాసీన్ తమ ఇంట్లో ఉండటం ఇష్టం లేని షమీ కుటుంబసభ్యులు ఆమెను పట్టించుకోవడం మానేశారు. దాంతో హసీన్ అత్తింటి వాళ్లతో గొడవకు దిగింది. ఇంటిలో నుంచి వెళ్లిపోవాల్సిందిగా వారు చెప్పడంతో హసీన్ కూతురితో సహా తనను తాను ఓ గదిలో బంధించుకుంది. 
 
ఇక షమీ కుటుంబసభ్యులు చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకున్నపోలీసులు హసీన్‌ జహాన్‌ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై హసీన్ వాదన మాత్రం ఇలా ఉంది. ‘నేను నా భర్త ఇంటికి వచ్చాను. ఇక్కడ ఉండేందుకు నాకు సర్వహక్కులు ఉన్నాయి. కానీ మా అత్తింటివాళ్లు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు’ అని అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments