Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రియురాలి పేరు అతియా శెట్టి.. పరిచయం చేసిన భారత ఓపెనర్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (11:52 IST)
భారత క్రికెట్ జట్టు ఓపెనర్లలో కేఎల్ రాహుల్ ఒకరు. ఇంకా బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్న ఈ ఓపెనర్... తాజాగా తన ప్రియురాలిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆమె పేరు అతియా శెట్టి. ఈమె ఎవరో కాదు.. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కుమార్తె. త‌న ల‌వ్ భాగస్వామి ఎవ‌ర‌న్న‌ది ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పేశాడు. 
 
బాలీవుడ్ న‌టి అతియా శెట్టితో కేఎల్ రాహుల్ గ‌త కొన్నాళ్ల నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే అతియా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాహుల్ త‌న ఇన్‌స్టాలో ఆమె ఫోటోను పోస్టు చేశాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ కాస్త‌.. ఇప్పుడు అఫిషియ‌ల్‌గా మారింది. 
 
హార్ట్ ఎమోజీతో అతియాకు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. జూలైలో ఈ ఇద్ద‌రూ త‌మ కామ‌న్ ఫ్రెండ్ సోనాలి ఫాబియానాతో దిగిన ఫోటోల‌ను వేరువేరుగా పోస్టు చేశారు. అప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రి రిలేష‌న్‌పై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. 
 
తాజాగా అతియా పుట్టిన రోజుతో ఆ రూమ‌ర్స్‌కు చెక్ ప‌డిన‌ట్లు అయ్యింది. ఆగ‌స్టులో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంది. రాహుల్‌తో చేసిన ఓ ఫోటోషూట్‌కు చెందిన పిక్‌ల‌ను కూడా అతియా త‌న ఇన్‌స్టాలో ఇటీవ‌ల పోస్టు చేసింది. 
 
రాహుల్‌, అతియాల మ‌ధ్య రిలేష‌న్ ఉన్న‌ట్లు 2019లోనే సందేహాలు వ్యక్తమవుతూ వచ్చాయి. వాళ్లు డేటింగ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ్యాపించాయి. క‌న్నూరు లోకేశ్ రాహుల్‌ది క‌ర్నాట‌క‌లోని మంగుళూరు కాగా, అతియాశెట్టిది ముంబై. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments