Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ స్టేడియంలో వుండగానే గుండెపోటుతో నేలకొరిగాడు.. చివరికి..? (Video)

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:11 IST)
Babu Nalawade
క్రికెట్ స్టేడియంలో ప్రాణాలు విడుస్తున్న క్రికెటర్ల సంఖ్య పెరుగుతుంది. జనవరి 18న కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 25 సంవత్సరాల రమణ్ గైక్వాడ్ మ్యాచ్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా రమణ్ గైక్వాడ్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. 
 
తాజాగా ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. పూణేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. క్రికెట్ పిచ్‌పై నాన్ స్ట్రైకింగ్ స్థానంలో ఉండగా.. ఊహించని రీతిలో నేలకొరిగిన అతడిని చూస్తూ ఉండగానే క్షణాల్లో అతడు కుప్పకూలిపోవడం.. అంపైర్, ఆటగాళ్లు.. అది గుర్తించి వెంటనే స్పందించడం కూడా జరిగింది. కానీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లే లోపే అతడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. అతడు కుప్పకూలిపోయిన విజువల్స్ మొత్తం వీడియోలో రికార్డు అయ్యాయి. 
 
మహారాష్ట్రలోని పుణెలో ఈ విషాదం చోటుచేసుకుంది. పుణేలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్‌మన్‌ బంతిని కొట్టగా పరిగెత్తేందుకు ప్రయత్నించాడు.. ఫీల్డర్‌ చేతిలోకి బంతి రావడంతో వెనుతిరిగారు. అయితే నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ బాబు నల్వాడే వెనక్కి తిరిగొచ్చేసి నిలబడ్డాడు. సాధారణంగానే వచ్చేశాడని అందరూ అనుకున్నారు.
 
అలా వచ్చిన బాబు మొదట బ్యాట్‌ను కిందకు పెట్టి.. మెల్లగా కిందకు కూర్చుంటూ వచ్చాడు. ఈ సమయంలో కొద్దిసేపటి తర్వాత బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని చూసిన అంపైర్‌ ఆటగాళ్లను పిలిచారు.
 
బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఉండి ఆ కొద్దిసేపటికి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని దగ్గర్లోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. 
 
గుండెపోటు కారణంగానే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాబు నల్వాడే ప్రాణాలు కోల్పోయాడని తెలియగానే ఆటగాళ్లందరూ తమ బాధను వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇష్టమైన ఆట ఆడుతూనే బాబు ప్రాణాలు విడిచాడు అంటూ పలువురు పోస్టులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

Jagan: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్మోహన్ రెడ్డి.. క్రిమినల్ కేసు పెట్టడం?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

తర్వాతి కథనం
Show comments