Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్‌ఎల్: మ్యాచ్ గ్రౌండ్‌లోకి అనుకోని అతిథి.. ఎవరో తెలుసా?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (12:54 IST)
PSL
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌లో అనుకోని అతిథి గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య జరగుతున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. చివరకి ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కరాచీ కింగ్స్ ఇన్నింగ్స్ 14 ఓవర్ సందర్భంగా మ్యాచ్ ఆగిపోయింది. 
 
ఓ శునకం మ్యాచ్ జరుగుతుండగా మైదానం మధ్యలోకి వచ్చి అక్కడే కూర్చుండి పోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ గురైనా గ్రౌండ్ సిబ్బంది దానిని వెంటనే మైదానం నుంచి బయటకు పంపించారు. కెమెరాలు కూడా మైదానంలోకి వచ్చిన ఆ అతిథిని పదేపదే చూపిస్తూ అభిమానులను నవ్వుకునేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. రవి బోపారా(40), సోహైల్ తన్వీర్(21) హిటింగ్‌తో కరాచీ కింగ్స్ ముందు పోరాడ్ లక్ష్యాన్ని ఉంచింది ముల్తాన్ సుల్తాన్. 
 
అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్సే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌ వరకు వెళ్ళింది. ఇక సూపర్ ఓవర్‌లో కరాచీ కింగ్స్ 13 రన్స్ చేసింది. తర్వాత ముల్తాన్ సుల్తాన్ 9 పరుగులే చేసి ఓటమి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

తర్వాతి కథనం
Show comments