ఐపీఎల్ 2024 : రాజస్థాన్ రాయల్స్‌పై సీఎస్కే విజయం

ఠాగూర్
ఆదివారం, 12 మే 2024 (19:17 IST)
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆదివారం సాయంత్రం సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సీఎస్కే జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు నిర్ధేశించిన 141 పరుగుల వియలక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆర్ఆర్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. 
 
జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 చొప్పున పగులు చేశారు. ఈ మూడు వికెట్లను సిమర్జీత్ సింగ్ ఖాతాలో చేరాయి. రియాన్ పరాగ్ 47 పరుగులు చేయగా, ధృవ్ జురెల్ 28 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 3, తుషార్ 2 చొప్పున వికెట్లు తీశారు. సీఎస్కే బౌలర్లు పక్కా ప్లాన్‌తో బంతులు వేయడంతో ఆర్ఆర్ జట్టు బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. 
 
ఆ తర్వాత 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే జట్టు... 18.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఈ జట్టులో రవీంద్ర 27, గైక్వాడ్ 42 (నాటౌట్), మిచెల్ 22, అలీ 10, శివం దుబే 18, రవీంద్ర జడేజా 5, రిజ్వి 15(నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఆర్ఆర్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా, బర్గర్, చావల్‌లు ఒక్కో వికెట్ తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments