Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాను ఆదుకున్న ఆపద్భాంధవులు-ధోనీ, హార్థిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్

నీ, హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌లతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు రాబట్టింది. తద్వారా టీమిండియా ఆస్ట్రేలియా ముందు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (18:07 IST)
ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కష్టాల్లోపడింది. కేవలం 87 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 పరుగుల వద్ద అజింక్యా రహానే (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అదే స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ (0), మనీష్ పాండే (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కేదార్ జాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే జట్టు స్కోరు 64 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ (28) అవుటయ్యాడు. 
 
ఇలా 64 పరుగులకే నాలుగు ముఖ్యమైన వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 87 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (40) అవుటయ్యాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు నెమ్మదిగా ఆడుతూ.. జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఏకంగా ఆరో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 66 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 83 పరుగుల చేసి, జంపా బౌలింగ్‌లో ఫాల్క్‌నర్‌కు క్యాచ్చి వెనుదిరిగాడు. 
 
ఈ క్రమంలో ధోనీతో జతకలిసిన భువనేష్ కుమార్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదేసమయంలో ధోనీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 47 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. చివ‌రి ఐదు ఓవ‌ర్లు మిగిలి ఉన్న స‌మ‌యంలో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో అల‌రించాడు. చివరకు 49.4 ఓవర్ల వద్ద 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. కాగా ధోనీ, హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌లతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు రాబట్టింది. తద్వారా టీమిండియా ఆస్ట్రేలియా ముందు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments