Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వన్డే : హార్దిక్ పాండ్యా మెరుపులు.. ఆపద్బాంధవుడు ధోనీ...

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కష్టాల్

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (17:17 IST)
ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కష్టాల్లోపడింది. కేవలం 87 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 పరుగుల వద్ద అజింక్యా రహానే (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అదే స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ (0), మనీష్ పాండే (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కేదార్ జాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే జట్టు స్కోరు 64 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ (28) అవుటయ్యాడు. 
 
ఇలా 64 పరుగులకే నాలుగు ముఖ్యమైన వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 87 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (40) అవుటయ్యాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు నెమ్మదిగా ఆడుతూ.. జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఏకంగా ఆరో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 66 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 83 పరుగుల చేసి, జంపా బౌలింగ్‌లో ఫాల్క్‌నర్‌కు క్యాచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ధోనీతో జతకలిసిన భువనేష్ కుమార్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదేసమయంలో ధోనీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 47 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments