Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండంటే రెండు పరుగులకే ఆలౌట్ అయిన క్రికెట్ జట్టు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (17:53 IST)
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌ పోటీల్లో ఓ చెత్త రికార్డు నమోదైంది. హంటింగ్‌డాన్‌షైర్ కౌంటీ లీగ్‌లో భాగంగా ఫాల్కన్ జట్టుతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో బక్డెన్ ​క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్‌తో కేవలం రెండంటే రెండు పరుగులు మాత్రమే నమోదు చేసి ఆలౌటైంది. ఈ రెండు పరుగులు కూడా వైడ్, బై రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ఓ వన్డే జట్టు అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేసి, క్రికెట్‌ చరిత్రలో అత్యంత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకోవడం ఇదే తొలిసారి. 
 
బక్డెన్ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారు. పది మంది ప్లేయర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. ప్రత్యర్ధి బౌలర్లు అమన్‌దీప్‌ సింగ్, హైదర్ అలీ దెబ్బకు బక్డెన్ ప్లేయర్లు ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోయారు. అమన్‌దీప్ నాలుగు ఓవర్లను మెయిడిన్ చేసి 6 వికెట్లు పడగొట్టగా, అలీ 4.3 ఓవర్లలో రెండు మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్ ​జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఫహీమ్ సబీర్ భట్టి (65), మురాద్ అలీ (67) హాఫ్ సెంచరీలతో రాణించారు. 
 
అనంతరం 261 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బక్డెన్‌ జట్టు.. అమన్‌దీప్‌ సింగ్(6/0), హైదర్ అలీ(2/0) ధాటికి 8.3 ఓవర్లలో 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ​దీంతో ఫాల్కన్ జట్టు 258 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 
 
అయితే, ఈ మ్యాచ్ ఈ నెల 19వ తేదీన జరుగగా, వివరాలు మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ బోర్డు వైరల్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో దారుణ పరాభవం అనంతరం బక్డెడ్ జట్టు కెప్టెన్ జోయల్ మీడియాతో మాట్లాడాడు. 
 
జట్టులోని 15 మంది ప్రధాన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు గైర్హాజయ్యారని, వ్యక్తిగత కారణాల వల్ల వారంతా మ్యాచ్‌లో ఆడలేకపోయారని, చేసేదేమీ లేక రెండో జట్టుతో బరిలోకి దిగామని పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

Chandrababu Naidu: కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను.. చంద్రబాబు

Cardiac Arrest: గుండెపోటు స్టీరింగ్‌పైనే కుప్పకూలిన ఏపీఎస్సార్టీసీ డ్రైవర్.. ఆ తర్వాత ఏమైందంటే?

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments