Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు : ఖర్చులో సగం సొమ్ము భారత సైన్యానికి..

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (10:39 IST)
ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. ఈ వేడుకలకు అయ్యే ఖర్చులో సగం మొత్తాన్ని భారత సైన్యానికి అందజేయాలని భావిస్తోంది. 
 
ప్రతీ యేటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అసలు బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్‌ల కంటే.. ఐపీఎల్ ద్వారానే వచ్చే ఆదాయమే అత్యధికంగా ఉంది. ఇలా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు.. ప్రతీ ఏడాది ప్రారంభ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
అయితే.. ఇప్పుడు అనూహ్యంగా.. ఆరంభ వేడుకలను.. బీసీసీఐ రద్దు చేయాలనుకుంటుందట. ప్రారంభ వేడుకలకు డబ్బు అనవసరంగా ఖర్చు అవుతోందని.. అందులోనూ.. అభిమానులు కూడా వీటిపై ఆసక్తి చూపకపోవడంతోనే.. వీటిని రద్దు చేయాలనుకుంటుందట. 
 
అలాగే.. ఈ వేడుకల్లో పాల్గొన్న నటీనటులకు, కళాకారులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోందని.. అందులో ఐపీఎల్-2020 సీజన్ నుంచి ప్రారంభ వేడుకలు లేకుండా.. టోర్నీలు కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందని ఓ అధికారి తెలిపారు. మరో కారణమేమంటే, పూల్వామా ఉగ్రదాడిలో పలువురు జవాన్లు అమరులు అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో అప్పటి సీఓఏ వేడకలను రద్దు చేసి.. ఆ మొత్తం ఖర్చులో సగం భారత సైన్యానికి విరాళం ఇచ్చింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలానే చేయాలని బీసీసీఐ భావిస్తోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

తర్వాతి కథనం
Show comments