కెప్టెన్‌గా బాబర్ పనికిరాడు, ప్రతిరోజూ 8 కిలోల మటన్ మెక్కుతున్నారు, పీకెయ్యండి

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (13:56 IST)
ప్రపంచ కప్ 2023 పోటీల్లో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమవ్వడంపై పాకిస్తాన్ క్రికెట్ క్రీడాభిమానులు, క్రికెట్ సీనియర్లు వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ పగ్గాలను బాబర్ నుంచి తప్పించాలనీ, ఆ స్థానంలో షహిన్ ఆఫ్రిదిని నియమించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో కూడా ఓడిపోవడం చూస్తుంటే... పాకిస్తాన్ జట్టు క్రీడాకారులకు అసలు ఫిట్నెస్ లేదని అర్థమవుతుందని అంటున్నారు. దీనిపై సీనియర్లలో ఒకరైన వసీం స్పందించారు.

ప్రతిరోజూ ఒక్కొక్కరు 8 కిలోల మటన్ మెక్కుతున్నారు
భారత్‌‍లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీ పోటీల్లో భాగంగా, సోమవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని పాక్ మాజీ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. రోజుకు ఎనిమిది కేజీల మటన్ ఆరగిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయంటూ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మండిపడ్డారు. 
 
ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ వంటి పసికూన చేతిలో.. అదీ 8 వికెట్ల తేడాతో ఓడిపోవడం పాకిస్థాన్‌కు ఘోర పరాభవమనే చెప్పాలి. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. అన్ని విభాగాల్లో పాక్ క్రీడాకారులు నిరాశపరిచారు. పాక్ క్రీడాకారుల్లో కనీస ఫిట్నెస్ స్థాయులు కూడా లేకపోవడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ క్రమంలో పాక్ మాజీ క్రీడాకారుడు వసీం అక్రం చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 
'ఇది నిజంగా తలవంపులే, జస్ట్ రెండు వికెట్లు.. 280 - 290 స్కోరు.. పెద్దదేమీ కాదు. పిచ్ సంగతి పక్కన పెడితే ఓసారి పాక్ ఫీల్డింగ్ చూస్తే వీళ్ల ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. క్రీడాకారుల్లో రెండేళ్లుగా ఫిట్నెస్ తగ్గిందని మ్యాచ్ సందర్భంగా మేము పలుమార్లు చర్చించుకున్నాం. ఇక్కడ క్రీడాకారుల పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు. కానీ వీళ్లు రోజుకు 8 కేజీల చొప్పున మటన్ తింటున్నట్టు ఉంది. వాళ్లు దేశం తరపున బరిలోకి దిగారు. ఇందుకోసం పారితోషికం కూడా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కాస్తంత ప్రొఫెషనల్‌గా ఉండాలి' అని సూచించారు. 
 
'ఇలాంటి విషయాల్లో మిస్బా కచ్చితంగా ఉండేవాడు. క్రీడాకారులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేవాడు. ఇది వారికి నచ్చేది కాదు కానీ జట్టు పరంగా అద్భుతాలు సృష్టించింది. ప్రస్తుతం ఏ స్థితికి చేరుకున్నామంటే విజయం కోసం దేవుణ్ణి ప్రార్థించాల్సి వస్తోంది. అది జరిగితే బాగుండును.. ఇది జరిగితే బాగుండును.. మరో టీం ఓటమి చెందితే సెమీస్కు చేరొచ్చంటూ మాట్లాడుతున్నాం. ఫీల్డింగ్ అంటే ఫిట్నెస్‌తో ముడిపడింది. మైదానంలో ఇది స్పష్టంగా తెలిసిపోతుంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments