Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిచెల్ మార్ష్ అహంకారం... చేతిలో బీరు బాటిల్.. కాళ్లకింద ప్రపంచ కప్ ట్రోఫీ

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (14:56 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. దీంతో కంగారులు వన్డే ప్రపంచ కప్‌ను అందుకున్నారు. అయితే, ఆ జట్టులోని బౌలర్ మిచెల్ మార్ష్ చేసిన పనికి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో బీరు సీసా పట్టుకుని, ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి కుర్చీలో కూర్చొనివున్న ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోను చూసిన క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ మార్ష్‌కు ఇంత అహంకారం పనికిరాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
 
సాధారణంగా ఎవరైనా ప్రపంచ కప్‌ను గెలిస్తే నెత్తిన పెట్టుకుంటారు. ముద్దాడుతారు. ఆ ట్రోఫీని చూసి మురిసిపోతారు. కానీ, ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకుని కుర్చీలో ఠీవీగా కూర్చొనివున్నాడు. ఆరుసార్లు వరల్డ్ కప్ గెలిచిన అహంకారం కళ్లు నెత్తికెక్కేలా చేశాయంటూ అభిమానులు మార్ష్‌పై మండిపడుతున్నారు. 
 
ట్రోఫీకి కనీస గౌరవం ఇవ్వకపోతే మీరు ఎన్నిసార్లు గెలిచినా ఓడినట్టేనని కామెంట్స్ చేస్తున్నారు. పైగా, ప్రపంచ కప్‌‍ను అవమానం చేసినందుకు మిచెల్ మార్ష్‌పై నిషేధం విధించాలంటూ ఐసీసీని కోరుతున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని ఇలా అగౌరవపరచడం సిగ్గుండాలి అంటూ మరో యూజర్ కామెంట్స్ చేశాడు. నిజానికి క్రికెట్‌లో అహంకారానికి ఆస్ట్రేలియన్లు అసలు సిసల నిదర్శనమని, ఇపుడు మరోమారు ఆ అహంకారాన్ని తమ చేతల్లో చూపించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

తర్వాతి కథనం
Show comments