కేఎల్ రాహుల్ బర్త్‌డే స్పెషల్ - కుమార్తెకు నామకరణం చేసిన దంపతులు!

ఠాగూర్
శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (16:33 IST)
భారత క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ తన పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ పండంటి బిడ్డకు నామకరణం చేశారు. రాహుల్ - బాలీవుడ్ నటి అతియా శెట్టిల జంట ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెల్సిందే. ఈ చిన్నారికి పెట్టిన పేరును కేఎల్ రాహుల్ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. 
 
అతియా, రాహుల్‌లు తమ నవజాత బిడ్డతో ఉన్న ఓ అందమైన పోటోను షేర్ చేస్తూ తమ కుమార్తె పేరును ప్రకటించారు. మా పాప, మా సర్వస్వం. ఇవారా - దేవుడిచ్చిన వరం అంటూ రాహుల్ పోస్ట్ చేశారు. ఇవారా అనే పేరుకు దేవుడు బహుమతి అని అర్థం వస్తుంది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులు గత యేడాది వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. ఈ యేడాది మార్చి 24వ తేదీన వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. అప్పటి నుంచి తమ కుమార్తెకు ఏం పేరు పెడతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా, వారు శుక్రవారం ఇవారా అన పేరు పెట్టినట్టు అధికారికంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments