Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వెటరన్ క్రికెటర్ 'స్లీప్ విత్ మి' అని అడిగాడు : అనయ బంగర్

Advertiesment
anaya bangar

ఠాగూర్

, శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (13:50 IST)
లింగ మార్పిడి చికిత్సతో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన తనకు అనేక మంది క్రికెటర్లు న్యూడ్ ఫోటోలు పంపించి వేధించారని, ఈ విషయాన్ని ఓ సీనియర్ క్రికెటర్‌కు చెపితే 'స్లీప్ విత్ మి' అని అడిగాడని అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ లింగ మార్పిడి చికిత్సతో అనయ బంగర్‍గా మారారు. తన కొత్త ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ప్రస్తుతం అనయ లండన్‌లో ఉంటున్నారు. ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు.
 
ఎనిమిది తొమ్మిదేళ్ల వయసులో ఉన్నపుడు నేను మా అమ్మ కప్‌బోర్డులో నుంచి దుస్తులు తీసుకోవడం అలవాటైంది. వాటిని ధరించి అద్దంలో చూసుకున్నాను. నేను అమ్మాయిని. అమ్మాయిగా ఉండాలని అనుకున్నా. నేను అబ్బాయిగా ఉన్నపుడు క్రికెట్ ఆడాను. ఇపుడున్న యువ క్రికెటర్లు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్.. ఇలా అనేక మంది కుర్రాళ్లతో ఆడాను. అయితే, నా గురించి వారెవ్వరికీ చెప్పలేదు. మా నాన్న అందరికీ తెలిసి క్రికెటర్. ఎందుకంటే క్రికెట్ ప్రపంచం అభద్రత, విషపూరిత  పురషత్వంతో నిండి ఉంది. 
 
కొందరు క్రికెటర్లు అసభ్యకరమైన ఫోటోలు పంపేవారు. తరచూ న్యూడ్ ఫోటోలు పంపి వేధించేవారు. ఒకరు అందరి ముందు మద్దతుగా మాట్లాడేవాడు. ఎవరూ లేనపుడు మాత్రం తన పక్కనే కూర్చోమని నా ఫోటోలు పంపమని అడిగేవాడు. నేను భారత్‌లో ఉన్నపుడు ఓ వెటరన్ క్రికెటర్‌కు నా పరిస్థి గురించి చెప్పాు. సరే పద కారులో వెళ్దామని చెప్పి.. స్లీప్ విత్ మి అని అడిగాడు. ఇలాంటి పరిస్థితులతో తొలినాళ్ళలో చాలా ఇబ్బందిపడ్డాను అని అనయ బంగర్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ బెట్టింగ్: ఐఫోన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌‌ పోగొట్టుకున్నాడు.. అంతే ఆత్మహత్య