Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళిరోజు ఏ గిఫ్ట్ ఇస్తారని అడిగితే.. విడాకులు ఇచ్చారు: ఇమ్రాన్‌పై రెహమ్ కామెంట్స్

పాకిస్థాన్ రాజకీయ నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య రీహమ్ విమర్శలు గుప్పించారు. పెళ్ళిరోజు బహుమతిగా ఏమిస్తారని గత ఏడాది అక్టోబర్ 31న ఇమ్రాన్‌ను అడిగితే.. చివరకు తనకు విడాకులు ఇచ్చారన్నారు. '

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (09:34 IST)
పాకిస్థాన్ రాజకీయ నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య రీహమ్ విమర్శలు గుప్పించారు. పెళ్ళిరోజు బహుమతిగా ఏమిస్తారని గత ఏడాది అక్టోబర్ 31న ఇమ్రాన్‌ను అడిగితే.. చివరకు తనకు విడాకులు ఇచ్చారన్నారు. ''మా పెళ్లి రోజు సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31న ఏ బహుమతి ఇస్తారని అడిగాను. విడాకులు ఇచ్చారు" అని పేర్కొంది. 
 
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నవంబర్ రెండో తేదీన ఇస్లామాబాద్‌లో మహార్యాలీ నిర్వహిస్తున్నట్లు ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలో రెహమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతేడాది తన విషయంలో ఇమ్రాన్‌ చేసినట్టుగా ఇంకెవ్వరికి  చేయకూడదని ప్రార్థిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. 
 
కాగా, ఇంగ్లండ్‌‌కు చెందిన జెమీమా గోల్డ్‌ స్మిత్‌‌ను మొదట పెళ్లి చేసుకున్న ఇ‍మ్రాన్‌ 2004లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండేళ్ల క్రితం ఇమ్రాన్‌ టీవీ జర్నలిస్టు రెహమ్‌‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన 10 నెలలకే ఇమ్రాన్‌.. రెహమ్‌‌కు కూడా విడాకులు ఇచ్చాడు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments