Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీగా దీపావళి సెలెబ్రేట్ చేసిన కోహ్లీ, అనుష్క.. గోవాలో తళుక్కుమన్న ప్రేమ జంట..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. శనివారం విశాఖపట్నంలో కివీస్ చివరి వన్డే మ్యాచ్ పూర్తయిన తర్వాత కోహ్లీ గోవాకు ప్రయాణమయ్య

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (09:00 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. శనివారం విశాఖపట్నంలో కివీస్ చివరి వన్డే మ్యాచ్ పూర్తయిన తర్వాత కోహ్లీ గోవాకు ప్రయాణమయ్యాడు. ఐఎస్ఎల్.. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఎఫ్‌సీ గోవా, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ జంట కనిపించారు. ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ ఈ జంట హ్యాపీగా గడిపారు.
 
ఎఫ్‍‌సీ గోవా సహ యజమాని అయిన కోహ్లి టీమ్ జెర్సీలో మెరిశాడు. అనుష్క తెలుపు రంగు సల్వార్ సూట్‌లో సింపుల్‌గా ఉంది. చాలా కాలం తర్వాత కోహ్లి-అనుష్క కలిసి బహిరంగంగా కనబడడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ఎల్ మ్యాచ్ సందర్భంగా వీరితో కలిసి ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
 
కోహ్లీ, అనుష్క చిరునవ్వుతో ఫ్యాన్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-2తో గెలిచిన సంగతి తెలిసిందే. శనివారం విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించి ధోనిసేన సిరీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments