ఆసియన్ గేమ్స్‌.. ఒకేరోజు రెండు పతకాలు.. గొప్పగా అనిపించింది..

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (17:01 IST)
Asian Games
ఆసియన్ గేమ్స్‌లో ఒకేరోజు రెండు పతకాలు సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు' అని ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ అన్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులో భాగమైన ఐశ్వరి ప్రతాప్.. అదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో కూడా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించాడు.
 
మధ్యప్రదేశ్ యువకుడైన ఐశ్వరీ ప్రతాప్ మాట్లాడుతూ.. " ఈ బంగారు పతకం ప్రత్యేకమైంది. టీమ్ విభాగంలో స్వర్ణం సాధించి ఆసియా క్రీడల్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశం కోసం పతకం సాధించడం గర్వంగా వుంది." అన్నాడు. 
 
దివ్యాన్ష్ సింగ్ మాట్లాడుతూ, "మొదట కోచ్‌ల సంతోషానికి అవధుల్లేవ్. పోటీలో బంగారు పతకం సాధించామని తెలియగానే ఊహించని ఆనందం కలిగింది. ఇతర వ్యక్తిగత పతకాలు సాధించినప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ ఆ ఆనందాన్ని అనుభవించలేదు. మన జాతీయ గీతాన్ని వినిపించినప్పుడు నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను." అంటూ తెలిపాడు. 
 
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ మొత్తం 228.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముఖ్యంగా, అతను షూటింగ్ పోటీలో తన సహచరుడు రుద్రాంశ్ పాటిల్‌ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పాటిల్ 208.7 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments