Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరకాల ప్రత్యర్థుల సమరానికి వరుణ గండం

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (10:20 IST)
ఆసియా క్రికెట్ సందడి మొదలైంది. తొలి మ్యాచ్‌లో క్రికెట్ పసికూన నేపాల్‌ను పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడియింది. 250కి పైచిలుకు పరుగులతో ఓడించింది. అయితే, ఈ టోర్నీలో భాగంగా, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు శుక్రవారం తలపడనున్నాయి. సెప్టెంబరు రెండో తేదీ అయిన శనివారం ఈ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లోనే కాకుండా, యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆతృతతో ఎదురు చూస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు రూపంలో ముప్పు కలిగే ప్రమాదం పొంచివుంది. 
 
శనివారం శ్రీలంకలోని కాండీలో జరిగే మ్యాచ్ సందర్భంగా వాన కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ అంచనా. వాతావరణంలో తేమ 84 శాతంగా ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, క్రికెట్ అభిమానులు డీలా పడిపోయారు. ఉత్కంఠ పోరును మిస్ అవుతామన్న ఆందోళన వారిలో నెలకొంది.
 
ఇదిలావుంటే, ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు బుధవారం శ్రీలంకకు చేరుకుంది. కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా టీం సభ్యులందరూ ప్రత్యేక బస్సులో ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు చేరుకున్నారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీన దాయాది దేశం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ ఈ టోర్నమెంట్లో రంగంలోకి దిగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. కత్తులతో వెంటబడి..?

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ భావేద్వేగానికి లోనైన రిషి సునాక్!

మాజీ సీఎం జగన్‌కు మతిభ్రమించింది.. ఆట ఇపుడే మొదలైంది... : బొలిశెట్టి సత్యనారాయణ

డ్రైవర్ లేదు.. కానీ బస్సు తానంతట అదే నడిచింది.. వ్యక్తి మృతి.. ఎలా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments