Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : భారత్ ఆశలు గల్లంతు.. ఫైనల్లో పాకిస్థాన్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (09:16 IST)
ఆసియా కప్ టోర్నీలోభాగంగా, బుధవారం రాత్రి ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడి గెలిచింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆప్ఘనిస్థాన్ జట్టు ఓడినంత పనిచేసింది. అయితే, పాకిస్థాన్ ఆటగాడు నసీమ్ షా వరుస బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టడంతో పాకిస్థాన్ చట్టు మరో నాలుగు బంతులు మిగివుంగానే గెలుపును సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. అదేసమయంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తలపడనుంది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. ఆప్ఘన్ ఆటగాళ్ళను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు ఈ స్కోరును ఛేదించేందుకు ఆపసోపాలు పడింది. లక్ష్యఛేదనలో 45 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును ఇఫ్తికార్ అహ్మద్ (30), షాహద్ కాన్ (36)లు ఆదుకున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో పాక్ గెలిచితీరాంటే ఆరు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన తరుణంలో చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే, ఫరూకీ వేసిన ఆ ఓవర్‌లో నసీమ్ షా తొలి రెండు బంతులను సిక్సర్లుగా మిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments