Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : కోహ్లీ - సూర్య అర్థ సెంచరీలు - హాంకాంగ్ టార్గెట్ 193 రన్స్

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (21:16 IST)
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలోభాగంగా, బుధవారం భారత్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు ప్రత్యర్థి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌లు అర్థ సెంచరీలతో రెచ్చిపోయారు. 
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో ఓ సిక్స్‌ సాయంతో 21 పరుగులు చేయగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 బంతుల్లో రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులు చేశారు. తొలి వికెట్ జట్టు స్కోరు 36 పరుగుల వద్ద రోహిత్ రూపంలో కూలింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. రాహుల్‌కు పూర్తిగా సహకారమందిస్తూ క్రీజ్‌లో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఈ క్రమంలో రెండో వికెట్ 94 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాత కోహ్లీతో జతకలిసి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హాంకాంగ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వద్ద పారించాడు. కేవలం 26 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరుఫోర్ల సాయంత్ర 68 పరుగులు చేశాడు. 
 
అలాగే, కోహ్లీ కూడా 44 బంతుల్లో మూడు సిక్స్‌లు ఓ ఫోర్ సాయంతో 59 రన్స్ చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేశాడు. ఇందులో ఎక్స్‌ట్రాల రూపంలో 8 పరుగులు ఉన్నాయి. హాంకాంగ్ బౌలర్లలో అయుష్ శుక్లా, మహ్మద్ గజన్‌ఫర్‍‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. దీంతో క్రికెట్ పసికూన భారత్‌ను ఓడించాలంటే ఓవర్‌కు 9.60 చొప్పున పరుగులు చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments