సచిన్ కుమారుడికి మొండిచేయి.. ఐపీఎల్ ఆశలు గల్లంతు!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (12:20 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు చుక్కెదురైంది. విజయ్‌ హజారె వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబై సీనియర్‌ జట్టు జాబితాలో అత‌డి పేరు లేదు. క‌నీసం అందులో చోటు సంపాదించుకోలేక‌పోవ‌డంతో ఐపీఎల్‌లో అత‌డు ప్ర‌వేశించ‌డం క‌ష్టమే. ఈ నెల 20 నుంచి విజయ్‌ హజారె వన్డే ట్రోఫీ ప్రారంభం కానుంది. 22 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించారు. ఇందులో అర్జున్ టెండూల్కర్ పేరు కనిపించలేదు.
 
నిజానికి త్వరలోనే ఐపీఎల్‌ సీజన్‌ వేలం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో పాల్గొన‌డానికి కుర్రాళ్లు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. త‌ద్వారా త‌మ టాలెంట్‌ను నిరూపించుకుని టీమిండియాలో చోటు సంపాదించాల‌ని అనుకుంటారు. ఈ కోరిక ఉన్న వారిలో అర్జున్ టెండూల్కర్‌ కూడా ఒకరు. 
 
కానీ, అయితే, ఐపీఎల్‌ సీజన్‌ వేలానికి ముందు అర్జున్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. విజయ్‌ హజారె వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబై సీనియర్‌ జట్టు జాబితాలో అత‌డి పేరు లేదు. 
 
క‌నీసం అందులో చోటు సంపాదించుకోలేక‌పోవ‌డంతో ఐపీఎల్‌లో అత‌డు ప్ర‌వేశించ‌డం క‌ష్టమే. ఈ నెల 20 నుంచి  విజయ్‌ హజారె వన్డే ట్రోఫీ ప్రారంభం కానుంది.  22 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించారు. ఆ జ‌ట్టుకు శ్రేయస్‌ అయ్యర్ సార‌థిగా ఉంటాడు. 
 
ఇప్ప‌టికే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారి ముంబై సీనియర్‌ జట్టుకు అర్జున్ టెండూల్క‌ర్ ఎంపికయ్యాడు. అయితే, అందులో రాణించలేకపోయాడు. దీంతో విజయ్‌ హజారె ట్రోఫీ జట్టులో పాల్గొనే అవ‌కాశం కోల్పోయాడు. ఇప్ప‌టికే అర్జున్ ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్‌ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. అత‌డిపై ఎవ్వ‌రూ ఆస‌క్తిక‌న‌బ‌ర్చే అవ‌కాశం లేదని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments