దినేష్ కార్తీక్.. నువ్వేమైనా ధోనీ అనుకుంటున్నావా? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:47 IST)
హామిల్టన్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో దినేష్ కార్తీక్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కివీస్‌తో ట్వంటీ-20 సిరీస్‌ను చేజార్చుకునేందుకు కారణం దినేష్ కార్తిక్ అంటూ ఫైర్ అవుతున్నారు.. నెటిజన్లు. ఈ మ్యాచ్‌కు చివరి ఓవర్లో భారత్‌కు 16 పరుగులు అవసరం కాగా.. మొదటి బంతికి డబుల్‌ తీసిన కార్తీక్‌ తర్వాతి బంతికి పరుగు చేయలేదు. మూడో బంతికి సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా కార్తీక్‌ అందుకు నిరాకరించాడు. 
 
అవతలి ఎండ్‌లో ఉన్న కృనాల్‌ పాండ్యా సింగిల్‌ కోసం ప్రయత్నించగా అతడిని కూడా రావొద్దన్నాడు. తర్వాత నాలుగు, ఐదు బంతులకు చెరో సింగిల్‌ తీయడంతో చివరి బంతికి పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతికి కార్తీక్‌ భారీ సిక్స్‌ బాదినా టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోలేదు. కేవలం నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
 
ఈ నేపథ్యంలో పరుగులు తీసే అవకాశం వున్నా దినేష్ కార్తీక్ మిన్నకుండిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడో బంతికి దినేశ్‌ కార్తీక్‌ పరుగుకు నిరాకరించడంతో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గౌతంగంభీర్‌ దినేశ్‌ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. అవతలి ఎండ్‌లో ఉన్నది కృనాల్‌ పాండ్యా.. అతడు టెయిలెండర్‌ కాదు అప్పటికే ధాటిగా ఆడుతున్నాడని అసహనం వ్యక్తం చేశాడు.
 
అంతేగాకుండా గతంలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 2012లో ధోని ఇలాగే ధోనీ సింగిల్‌ను నిరాకరించి రెండు బంతులు మిగులుండగానే జట్టును గెలిపించాడు. ఈ ఘటనను గుర్తు చేసుకొని నెటిజన్లు దినేశ్‌ కార్తీక్‌పై ట్వటర్‌లో మండిపడుతున్నారు. నువ్వేమైనా ధోనీ అనుకున్నావా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధం.. భర్తను అలా హత్య చేయించిన భార్య.. చివరికి?

వరంగల్, విజయవాడ జాతీయ రహదారులు అనుసంధానించే ప్రాజెక్టు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

తర్వాతి కథనం
Show comments