భారత్-కివీస్‌ల మధ్య శుక్రవారం జరిగిన టీ-20 మ్యాచ్‌లో ఆరంభం నుంచే కివీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయింది కివీస్. దీంతో ఒకింత అసహనానికి గురైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో కివీస్ 158 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
ముందుగా టాస్ గెలిచిన కివీస్.. తొలి ట్వంటీ-20 తరహాలో 200 పరుగుల పైచిలుకు సాధించేద్దామనే ఉత్సాహంతో బరిలోకి దిగింది. కానీ ఆరంభం నుంచే పరుగుల సాధనకు భారత బౌలర్లు అడ్డుపడ్డారు. ఇలా 15, 43, 45, 50 పరుగుల వద్ద వికెట్లు పతనం అయ్యాయి.
కానీ ఆరో ఓవర్ వద్ద కృనాల్ పాండ్యా బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయిన డ్యారీ మిట్టల్.. బాల్ ప్యాడ్‌కు తగిలేందుకు ముందు బ్యాటుకే తగిలిందని అంపైర్ వద్ద వాగ్వివాదానికి దిగాడు. థర్డ్ అంపైర్ కూడా అది అవుట్‌గా ప్రకటించినా కివీస్ కెప్టెన్, మిట్టల్ ఇద్దరూ అంపైర్ వద్ద వాదించడం మొదలెట్టారు. ఆపై కేన్ విలియమ్స్ కూడా ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ ముఖం పట్టాడు. తర్వాత గ్రామ్ 50 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
అలాగే రాస్ టేలర్ కూడా విజయశంకర్ డైరక్ట్ హిట్ రనౌట్‌తో 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. చివరి ఓవర్‌కు బంతులేసిన ఖాలిద్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టడం కివీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల పతనానికి 158 పరుగులు సాధించింది.