Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ డైనమెట్ రికార్డును బద్ధలుకొట్టిన విరాట్ కోహ్లీ

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (10:26 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో కోహ్లీ వ్యక్తిగతంగా 25 పరుగులు చేయ‌డం ద్వారా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
 
కాగా, హామిల్ట‌న్‌ టీ20లో కోహ్లీ 38 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. భారత్‌ తరపున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోనీ (1112 ) పేరిట ఉంది. తాజాగా ఆ రికార్డును  కోహ్లీ(1126) త‌న పేరిట లిఖించుకున్నాడు.
 
ఓవరాల్‌గా టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక రన్స్‌ చేసిన జాబితాలో సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌(1,273), న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలయమ్సన్‌(1148,  భార‌త్‌తో మూడో టీ20 ముందు వ‌ర‌కు) ఉన్నారు. దీంతో ఓవ‌రాల్ జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. 
 
మరోవైపు, ఈ ట్వంటీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. సూపర్ ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ సిరీస్‌ను తన వశం చేసుకుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలను మోసం చేసేవాళ్లు గొప్ప నాయకులు : నితిన్ గడ్కరీ

KCR: సీబీఐకి కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

తర్వాతి కథనం
Show comments