ADVANCE HBD ధోని: జులై 7వ తేదీన 39వ వసంతంలోకి..?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (11:21 IST)
Dhoni
భారత జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ జులై 7వ తేదీన 39వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ధోనీ పుట్టిన రోజుకి వారం సమయం ఉంది. అయితే ఇప్పటినుంచే ధోని అభిమానుల సందడి మొదలైంది. ధోనీకి అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా శుభాకాంక్షలు తెలిజేసెందుకు సిద్ధమయ్యారు. దీంతో సోషల్ మీడియాలో మిస్టర్ కూల్ ధోనీ పేరు ఇప్పటినుండే మార్మోగిపోతోంది.
 
ధోనీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి కామన్ డీపీ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్‌లో ఇప్పటికే #DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌ అవుతోంది. ఇక డీపీలో మహీ బ్యాట్ పట్టుకుని నిలబడగా.. వెనకాల ధోనీ అని రాసుకుంది. ధోనీ పేరు మొత్తం బిల్డింగ్స్ మాదిరిలో ఉండడం విశేషం. ప్రస్తుతం నెట్టింట్లో ఈ కామన్ డీపీ వైరల్ అవుతోంది. మహీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
 
ధోనీకి ఓ సాంగ్ అంకితమిచ్చేందుకు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సిద్ధమయ్యాడు. ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ... ఎంఎస్ ధోనీ సాంగ్‌ నం 7 పేరిట బ్రావో ఈ పాటను రూపొందిస్తున్నాడు. ఆ పాటను ధోని పుట్టినరోజున విడుదల చేస్తాడు.
 
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ధోనిని తప్పించింది. ఐపీఎల్‌లో 13 సీజన్ లో ధోని రంగప్రవేశం చేయాలని భావించాడు. 
 
అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో ధోని రాణిస్తే అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)

నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?

ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

తర్వాతి కథనం
Show comments