Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన ధోనీ.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 2 జులై 2022 (13:27 IST)
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మోకాలి నొప్పులతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మిస్టర్‌ కూల్‌ అయిన ధోనీ ఇటీవల ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం.
 
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆఖరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  జార్ఖండ్‌ రాజధాని రాంచీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాపంగ్‌లో గల వందన్‌ సింగ్‌ ఖెర్వార్‌ అనే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారు. ఆయన హస్తవాసి గురించి స్థానికంగా మంచి పేరుంది.
 
ఈ విషయం తెలుసుకున్న ధోని ఆయన దగ్గరకు వెళ్లి మోకాలి నొప్పుల సమస్యల గురించి బయటపడే మార్గం గురించి అడిగాడు. కాల్షియం లోపం వల్ల తాను బాధపడుతున్నానని ఖెర్వార్‌కు ధోని చెప్పాడు. దీంతో ప్రతిసారి నాలుగు రోజులకు ఓసారి తన వద్దకు రావాల్సిందిగా సదరు వైద్యుడు సూచించాడు.
 
ఈ విషయాల గురించి ఆయుర్వేద డాక్టర్‌ వందన్‌ సింగ్‌ ఖెర్వార్‌ ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ''మొదటి సారి ధోని నా దగ్గరకు వచ్చినపుడు ఆయనను గుర్తుపట్టలేకపోయాను. కన్సల్టేషన్‌ ఫీజు కింద 20 రూపాయలు.. చికిత్సకై మందుల కోసం 20 రూపాయల మేర ప్రిస్కిప్షన్‌ రాశాను.
 
ధోని తల్లిదండ్రులకు కూడా నేను వైద్యం చేస్తున్నాను'' అని చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి గురించి తన గురించి తెలుసుకున్న ధోని తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. 
 
కాగా ధోని లాపంగ్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే, ధోని మాత్రం సెల్ఫీలు గట్రా వద్దంటూ వారిని సున్నితంగా వారిస్తున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో మరో క్యాన్సర్ ఆస్పత్రి.. తుళ్లూరులో ప్రారంభం

రూ.500 బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసిన ప్రేమికులు.. అందులో ఏముందంటే?

భర్త కాకుండా వేరే వ్యక్తి పట్ల ప్రేమ నేరం కాదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు

Jayalalithaa-జయలలిత ఆస్తుల స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభం..

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments