Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ తొలి డబుల్ సెంచరీకి 8 యేళ్లు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో వన్డేలు, టెస్టుల్లో కలుపుకుని 100 సెంచరీలు ఉన్నాయి. అలాగే, అత్యధిక పరుగుల రికార్డు, ఎన్నో ఘనతలను తన పేరిట లి

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (17:19 IST)
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో వన్డేలు, టెస్టుల్లో కలుపుకుని 100 సెంచరీలు ఉన్నాయి. అలాగే, అత్యధిక పరుగుల రికార్డు, ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఆ దిగ్గజ క్రికెటర్‌కు ఇంక ఏదో సాధించాలనే కసి. ఆరోజు కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశాడు. చివరికి అతని కల నెరవేరింది.
 
అది 2010 ఫిబ్రవరి 24. గ్వాలియర్‌లో సౌతాఫ్రికా, భారత్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా ఓపెనర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో సచిన్ వయసు 37 ఏళ్లు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడుతూ.. 50, 100, 150, 190.. ఇలా దాటుతుండగానే అభిమానులంతా టెన్షన్‌కు గురయ్యారు. 
 
ఔట్‌కాకుండా 200 పరుగులు చేయాలని మైదానంలోని ప్రతి అభిమాని తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు ఆడిన సచిన్ 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో వన్డేల్లో తొలిసారి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా క్రికెట్ దేవుడు సచిన్ చరిత్ర సృష్టించాడు. 
 
అభిమానులకు అభివాదం చేసిన సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆరోజు సచిన్‌తో పాటు బ్యాటింగ్ చేసిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ మైలురాయి సాధించడంలో మంచి సహకారం అందించాడు. అంతకుముందు వన్డేల్లో 194 అత్యధిక స్కోరు. ఆ తర్వాత భారత స్టార్ క్రికెటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చూసి వారెవ్వా అనిపించిన విషయం తెలిసిందే. సచిన్ చేసిన ఈ తొలి డబుల్ సెంచరీకి నేటితో సరిగ్గా 8ఏళ్లు పూర్తయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

తర్వాతి కథనం
Show comments