Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5లక్షల పరిహారం: జగన్

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:47 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు.. కరోనా ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే కరోనా బారిన ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వీరిలో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు. వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా విపత్కర సమయంలో ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్‌ ముందుకొచ్చింది. వైరస్‌పై పోరులో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌రెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెల్లడించారు.
 
ఈ సందర్భంగా  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కరోనా వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. వార్త సేకరణలో భాగంగా అందరు ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్టులు కరోనా వారియర్స్‌ అని తెలిపారు. 
 
జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అని అన్నారు. 38 మంది మృతి చెందినట్లు సీఎం జగన్‌ చెప్పారు. మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే చికిత్స తీసుకునేవారికి ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments